గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 10, 2020 , 00:45:03

ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ ఉంచలేం: ట్రేడర్లు

ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్‌ ఉంచలేం: ట్రేడర్లు

న్యూఢిల్లీ, జూలై 9: ఖాతాల్లో కనీస నగదు నిల్వల నిబంధనల నుంచి ట్రేడర్ల కరెంట్‌ అకౌంట్లకు మినహాయింపు ఇవ్వాలని అఖిల భారత వ్యాపార మండలి సమాఖ్య (ఎఫ్‌ఏఐవీఎం) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బ్యాంకులకు సూచనలివ్వాలని గురువారం రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌కు సమాఖ్య లేఖ రాసింది. కరోనా వైరస్‌ ధాటికి చితికిపోయిన చిరు వ్యాపారులు బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో కనీస నగదు నిల్వలను ఉంచలేని పరిస్థితి నెలకొందని తెలియజేసింది. అలాగే బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) అకౌంట్‌, బేసిక్‌ కరెంట్‌ అకౌంట్‌లకూ మినిమం బ్యాలెన్స్‌ల నుంచి ఊరట కల్పించాలని సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి వికే బన్సల్‌ విజ్ఞప్తి చేశారు.


logo