ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Business - Aug 05, 2020 , 02:07:02

రూ.250 కోట్లు ఉంటే ఇంధన లైసెన్సు

రూ.250 కోట్లు ఉంటే ఇంధన లైసెన్సు

  • సరళీకృత విధానంపై కేంద్రం వివరణ

న్యూఢిల్లీ: రిటైల్‌, బల్క్‌ వినియోగదారులకు పెట్రోల్‌, డీజిల్‌ను అమ్మేందుకు సరళీకృత లైసెన్సును పొందాలనుకొనే సంస్థలు కనీసం రూ.500 కోట్ల నికర సంపదను కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. 2019 నవంబర్‌లో తీసుకొచ్చిన సరళీకృత ఇంధన లైసెన్సింగ్‌ విధానంపై పెట్రోలియం, సహజవాయు శాఖ మంగళవారం ఓ ప్రకటనలో వివరణ ఇస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రూ.250 కోట్ల నికర సంపదను కలిగి ఉన్న ఏ సంస్థ అయినా బల్క్‌ లేదా రిటైల్‌ వినియోగదారులకు ఇంధనాన్ని అమ్మేందుకు లైసెన్సును పొందవచ్చని, రిటైల్‌, బల్క్‌ వినియోగదారులకు ఇంధనాన్ని అమ్మేందుకు లైసెన్సు పొందాలనుకొనే సంస్థలు కనీసం రూ.500 కోట్ల నికర సంపదను కలిగి ఉండాలని ఆ ప్రకటనలో తెలిపింది. చమురేతర కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ కేంద్రం గతేడాది వాహన ఇంధన అమ్మకాలకు సంబంధించిన నిబంధనలను సడలించింది.


logo