బుధవారం 05 ఆగస్టు 2020
Business - Jul 04, 2020 , 23:11:10

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో బాంబు పేలి ముగ్గురు పోలీసులు మృతి

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో బాంబు పేలి ముగ్గురు పోలీసులు మృతి

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్ కోహ్‌సాన్ జిల్లాలో ఘోరం జరిగింది. రోడ్డు వెంబ‌డి పాతిపెట్టిన బాంబు పేలి ముగ్గురు పోలీసులు మృతిచెందారు. మ‌రో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాల‌య్యాయి. ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ స‌మాచారం తెలిసిన వెంట‌నే పోలీసులు అక్క‌డికి చేరుకున్నారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టానికి త‌ర‌లించారు. అయితే ఘ‌ట‌న‌కు బాధ్యులు ఎవ‌ర‌నే విష‌యం తెలియాల్సి ఉన్న‌ది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo