శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Feb 04, 2020 , 23:46:35

ఎల్‌ఐసీని ప్రైవేటుపరం కానివ్వం!

ఎల్‌ఐసీని ప్రైవేటుపరం కానివ్వం!
  • వాటా విక్రయాన్ని నిరసిస్తూ లక్ష మంది ఉద్యోగుల ఆందోళన

న్యూఢిల్లీ/ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  ఎల్‌ఐసీ ను కేంద్ర ప్రభుత్వం  ప్రైవేట్‌ పరం చేయడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లక్షమంది ఉద్యోగులు నిరసన బాటపట్టారు. మంగళవారం సైఫాబాద్‌లోని సౌత్‌ సెంట్రల్‌ జోనల్‌ కార్యాలయం ముందు ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా  ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్ష్యులు రమేశ్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను విడనాడాలని,  కోట్లలో లాభాలు వస్తున్న కంపెనీలో ప్రైవేట్‌ పెట్టుబడులకు అనుమతివ్వడాన్ని తప్పుపడుతున్నట్లు చెప్పారు. 


దేశ ఆర్థిక వ్యవస్థకు ఎల్‌ఐసీ వెన్నుముకలాంటిదని, ఇలాంటి సంస్థను ప్రైవేట్‌ పరం చేయడాని నిరసిస్తూ త్వరలో పార్లమెంట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.  రూ.32 లక్షల కోట్ల నికర ఆస్థులు కలిగి ఉన్న జీవిత బీమా సంస్థను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. ఎల్‌ఐసీలో 1.25 లక్షల మంది ఉద్యోగులు,  30 కోట్ల మంది పాలసీ హోల్డ ర్లు అందరూ కలిసి ఈ కుట్రను తిప్పికొట్టాలని ఆయన కోరారు. కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే దేశ రాజధానిలో భారీ ప్రదర్శనతో ఛలో పార్లమెంట్‌ కార్యక్రమానికి పిలుపునిస్తామని వారు హెచ్చరించారు.  


logo