శనివారం 06 జూన్ 2020
Business - May 21, 2020 , 23:53:45

జీఎమ్మార్‌కు ఎదురుదెబ్బ

జీఎమ్మార్‌కు ఎదురుదెబ్బ

  • నాగపూర్‌ ఎయిర్‌పోర్ట్‌ కాంట్రాక్టు రద్దుచేసిన మిహాన్‌ 

నాగపూర్‌, మే 21: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ జీఎమ్మార్‌ ఇన్‌ఫ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏడాది క్రితం సంస్థకు లభించిన నాగపూర్‌ విమానాశ్రయ ఆధునీకరణ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు మిహాన్‌ ఇండియా లిమిటెడ్‌ గురువారం ప్రకటించింది. జీఎమ్మార్‌ ఎయిర్‌పోర్ట్స్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థయైన జీఎమ్మార్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు నాగపూర్‌ విమానాశ్రయ ఆధునీకరణ, నిర్వహణ, మేనేజ్‌మెంట్‌ కాంట్రాక్టును గతేడాది మిహాన్‌ లిమిటెడ్‌ అప్పగించింది. దీనిపై మహారాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ఎండీ అనిల్‌ పాటిల్‌ మాట్లాడుతూ..ఈ కాంట్రాక్టుపై కంపెనీ ఆందోళన వ్యక్తం చేయడంతో రద్దు చేసినట్లు, త్వరలో మరోదఫా టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. దీనిపై జీఎమ్మార్‌ గ్రూపు ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. 

కమలంగ  వాటా విక్రయానికి కరోనా సెగ

జీఎమ్మార్‌ కమలంగ ఎనర్జీ విక్రయానికి కరోనా వైరస్‌ సెగ తాకింది. ఒడిశాలో జీఎమ్మార్‌ కమలంగ ఎనర్జీకి ఉన్న 1,050 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీకి విక్రయించడానికి ఇరు సంస్థల మధ్య అంగీకార ఒప్పందం కుదిరింది.  కరోనా వైరస్‌తో ఈ ఒప్పందం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఒప్పందం విలువ రూ.5,321 కోట్లు.  


logo