బుధవారం 28 అక్టోబర్ 2020
Business - Sep 28, 2020 , 00:47:27

మిడ్‌, స్మాల్‌క్యాప్‌కు డిమాండ్‌

మిడ్‌, స్మాల్‌క్యాప్‌కు డిమాండ్‌

స్టాక్‌ మార్కెట్లలో మధ్య, చిన్న శ్రేణి షేర్లకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ.. మల్టీ-క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ కోసం పెట్టుబడి నిబంధనల్లో చేసిన సర్దుబాట్లు మదుపరుల దృష్టిని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల వైపు మళ్లించాయి. ఈక్విటీల్లో 75 శాతం కనీస కార్పస్‌ పెట్టుబడి ఉండాల్సిందేనని మల్టీ-క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు సెబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది 65 శాతంగానే ఉన్నది. భారీ, మధ్య, చిన్న శ్రేణి షేర్లలో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడి పెట్టాలని తెలిపింది. దీంతో నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 సూచీ 3.32 శాతం, స్మాల్‌క్యాప్‌ 100 5.56 శాతం ఎగబాకాయి. ఈ నిర్ణయం కొత్త మదుపరులకు ఉత్సాహం కలిగించేదేనని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


logo