శనివారం 30 మే 2020
Business - Feb 14, 2020 , 00:27:02

నెలాఖర్లో భారత్‌కు సత్య నాదెళ్ల

నెలాఖర్లో భారత్‌కు సత్య నాదెళ్ల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మైక్రోసాఫ్ట్‌ సీఈవో, భారత సంతతికి చెందిన సత్య నాదెళ్ల ఈ నెలాఖర్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు గురువారం ఆ సంస్థ తెలియజేసింది. అయినప్పటికీ ఏయే తేదీల్లో నాదెళ్ల భారత పర్యటన ఉంటుంది?.. ఏ నగరాల్లో ఆయన పర్యటిస్తారు?.. అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే ఈ నెల 24-26 మధ్య నాదెళ్ల భారత పర్యటన ఉండొచ్చని సమాచారం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఆయన పర్యటిస్తారని తెలుస్తున్నది. 


ఈ సందర్భంగా పరిశ్రమ పెద్దలు, ఆయా ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. కస్టమర్లు, యువ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, డెవలపర్లనుద్దేశించి మాట్లాడుతారని ఓ ఈ-మెయిల్‌ ప్రశ్నకు మైక్రోసాఫ్ట్‌ జవాబిచ్చింది. కాగా, పౌరసత్వ సవరణ బిల్లుపై నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేసిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది.


logo