సోమవారం 30 మార్చి 2020
Business - Jan 15, 2020 , 00:04:48

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మైఖేల్‌ దేబాబ్రత పాత్ర

 ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా మైఖేల్‌ దేబాబ్రత పాత్ర

న్యూఢిల్లీ, జనవరి 14: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా మైఖేల్‌ దేబాబ్రత పాత్ర నియమితులైయ్యారు. మూడేండ్లకుగాను ఈయన్ను నియమిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన ఆర్బీఐ ద్రవ్యవిధాన విభాగంలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. గతేడాది జూన్‌లో వైరల్‌ ఆచార్య తన డిప్యూటీ గవర్నర్‌ హోదాకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈయన స్థానంలోనే పాత్రను తీసుకున్నారు. కాగా, ఇటు డిప్యూటీ గవర్నర్‌గా అటు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పాత్ర పనిచేసే వీలుందని సమాచారం. ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ ఉండగా, మొత్తం నలుగురు డిప్యూటీ గవర్నర్లుంటారు. వీరిలో ఇప్పుడు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌, బీపీ కనుంగో, ఎంకే జైన్‌ ఉండగా, నాల్గో డిప్యూటీ గవర్నర్‌గా పాత్ర చేరారు.


logo