ఎంజీ, రెనాల్ట్లు ప్రియం

- జనవరి నుంచి పెరుగనున్న ధరలు
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడు వాహనాల ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఆందోళన చెందుతున్నాయి. ఈ భారాన్ని అధిగమించేందుకు దేశంలోని పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహన ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీతోపాటు ఫోర్డ్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటోకార్ప్ లాంటి సంస్థలు వచ్చే నెల నుంచి తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో మరో రెండు ఆటోమొబైల్ సంస్థలు చేరాయి. జనవరి 1 నుంచి తన వాహన ధరలను 3 శాతం మేరకు పెంచనున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా వెల్లడించింది. వాహనాల తయారీకి ఉపయోగించే స్టీల్ లాంటి ముడిపదార్థాల ధరలతోపాటు ఇతర ఖర్చులు పెరుగడమే ఇందుకు కారణమని ఆ కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎంజీ మోటర్ ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మూడు మోడళ్ల (హెక్టర్, జడ్ఎస్ ఈవీ, గ్లోస్టర్) వాహనాలను అమ్ముతున్నది. వీటి ధరలు రూ. 12.83 లక్షల నుంచి రూ.35.6 లక్షల మధ్యలో ఉన్నాయి.
త్వరలో హెక్టర్ ప్లస్ సెవెన్ సీటర్
హెక్టర్ ప్లస్ సెవెన్ సీటర్ వెర్షన్ వాహనాన్ని వచ్చే నెల మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఎంజీ మోటర్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. తద్వారా హెక్టర్ ప్లస్ ఎస్యూవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించనున్నట్టు ఆ కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్లో హెక్టర్ ప్లస్ సిక్స్ సీటర్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉన్నది. కెప్టెన్ సీట్లను కలిగి ఉండే ఈ వాహనం పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమవుతున్నది. దీని ప్రారంభ ధర రూ.13.73 లక్షలు. ఐదు సీట్లను కలిగి ఉండే ఎంట్రీ లెవెల్ హెక్టర్ వేరియంట్ కంటే హెక్టర్ ప్లస్ సిక్స్ సీటర్ ధర దాదాపు రూ.90 వేలు ఎక్కువ.
రూ.28 వేల వరకు పెంచనున్న రెనాల్ట్
రెనాల్ట్ ఇండి యా కూడా జనవరి నుంచి తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు రూ.28 వేల వరకు ఉంటుందని స్పష్టం చేసింది. వాహన వేరియంట్లను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని రెనాల్ట్ ఇండియా శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
తాజావార్తలు
- హీరోను అన్నా అనేసి నాలుక కరుచుకున్న లావణ్య
- వింగ్ కమాండర్ అభినందన్ విడుదల.. చరిత్రలో ఈరోజు
- చెప్పుతో కొట్టిందనే కోపంతో మహిళకు కత్తిపోట్లు!
- బీజేపీ ఎమ్మెల్సీకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన కేటీఆర్
- బెంగాల్ సీఎం మమతతో భేటీ కానున్న తేజస్వి
- కామాఖ్య ఆలయాన్ని దర్శించిన ప్రియాంకా గాంధీ
- ఒక్క సంఘటనతో పరువు మొత్తం పోగొట్టుకున్న యూట్యూబ్ స్టార్
- ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
- నాలుగో టెస్ట్‌కూ అదే పిచ్ ఇవ్వండి
- ఆప్‌లో చేరిన అందగత్తె మాన్సీ సెహగల్