సోమవారం 01 మార్చి 2021
Business - Jan 07, 2021 , 19:23:02

2022లో ఎంజీ మోటార్‌.. కొత్త ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

2022లో ఎంజీ మోటార్‌.. కొత్త ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశించిన ఎంజీ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేయాలని యోచిస్తోంది. భారత్‌లో రూ.20లక్షలలోపే  ఎలక్ట్రిక్‌ కార్లను ఆవిష్కరిస్తామని వెల్లడించింది.  విద్యుత్‌  కారును రోజువారీ ఉపయోగించుకోవడంలో ఎదురయ్యే పెద్ద సమస్య బ్యాటరీ ఛార్జింగే. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఈ సమస్యను అధిగమించేందుకు 500 కిలోమీటర్ల వరకు పనిచేసే లిథియం-అయాన్‌ బ్యాటరీని రూపొందించడానికి  కంపెనీ ప్రయత్నిస్తోంది. 

వచ్చే ఏడాది చివరల్లో 20లక్షల శ్రేణిలో మరో ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయాలనుకుంటున్నాం.  భారత్‌లో సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జర్ల నెట్‌వర్క్‌ను రూపొందించడానికి టాటా పవర్‌తో కలిసి పెట్టుబడులు పెట్టబోతున్నాం.  ఈ ఏడాది చివరినాటికి 30-40 సూపర్‌ ఛార్జర్లు ఏర్పాటు చేస్తామని  ఎంజీ మోటార్‌ ఇండియా ఎండీ రాజీవ్‌ చాబా తెలిపారు.  

VIDEOS

logo