మంగళవారం 09 మార్చి 2021
Business - Dec 30, 2020 , 21:22:00

కోయంబ‌త్తూరులో సూప‌ర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ షురూ

కోయంబ‌త్తూరులో సూప‌ర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేష‌న్ షురూ

కోయంబ‌త్తూర్‌: దేశం విద్యుత్ వాహ‌నాల వినియోగం దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులేస్తున్న‌ది. ఈవీ వాహనాల వాడ‌కంలో కీల‌క‌మైన బ్యాట‌రీ చార్జింగ్ స్టేష‌న్ల నిర్మాణం కీల‌కం. ఆ దిశ‌గా బుధ‌వారం దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం ఎంజీ మోటార్స్ ఇండియాతో క‌లిసి టాటా ప‌వ‌ర్ సంస్థ త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో ఈవీ చార్జింగ్ స్టేష‌న్‌ను ప్రారంభించింది. 60కిలోవాట్ల సామ‌ర్థ్యం గ‌ల ఈ చార్జింగ్ స్టేష‌న్‌లో వాహ‌నాల‌కు అత్యంత వేగంగా చార్జింగ్ చేయ‌గ‌ల‌గ‌డం దీని సామ‌ర్థ్యం. కోయంబ‌త్తూరులోని ఎంజీ మోటార్ ఇండియా డీల‌ర్‌షిప్ వ‌ద్ద ఈ చార్జింగ్ స్టేష‌న్ ఏర్పాటు చేశారు. ఇక్క‌డ సీసీఎస్ ఫాస్ట్ చార్జింగ్ ప్ర‌మాణాల‌తో అన్ని విద్యుత్ వాహ‌నాల చార్జింగ్ వ‌స‌తి క‌ల్పిస్తున్నారు. 

దేశ‌వ్యాప్తంగా 50కిలోవాట్ల‌, 60 కిలోవాట్ల డీసీ సూప‌ర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేష‌న్ల నిర్మాణానికి టాటా ప‌వ‌ర్‌తో ఎంజీ మోటార్ ఇండియా ఇటీవ‌ల భాగ‌స్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న‌ది. గ‌త నెల‌లో ఆగ్రాలో, ఈ నెల ప్రారంభంలో ల‌క్నోలో ఈ చార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రారంభించారు. 

ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ ఆఫీస‌ర్ గౌర‌వ్ గుప్తా మాట్లాడుతూ భార‌త‌దేశంలో కోయంబ‌త్తూర్ కీల‌క పారిశ్రా‌మిక హ‌బ్ అని, మ‌న‌దేశం గ్రీన్ అండ్ స‌స్టెయిన‌బుల్ ఫ్యూచ‌ర్ దిశ‌గా అడుగులేస్తున్న‌ద‌న్నారు. భార‌త వాణిజ్య‌, పారిశ్రామిక ప్ర‌ముఖులు ఈ డ్రైవ్‌లో భాగ‌స్వాములు అవుతున్నార‌ని, కోయంబ‌త్తూర్‌లో తొలి సూఫ‌ర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేష‌న్‌ను ప్రారంభించ‌డం గ‌ర్వ కార‌ణం అని తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo