సోమవారం 08 మార్చి 2021
Business - Jan 08, 2021 , 00:46:19

హెక్టర్‌ సెవెన్‌ సీటర్‌

హెక్టర్‌ సెవెన్‌ సీటర్‌

  • గరిష్ఠ ధర రూ.18.33 లక్షలు

న్యూఢిల్లీ, జనవరి 7: దేశీయ వాహన మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ హెక్టర్‌ను ఏడు సీట్ల వెర్షన్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది ఎంజీ మోటార్‌. ఈ వాహనం రూ.13.35 లక్షలు మొదలుకొని రూ.18.33 లక్షల మధ్యలో లభించనున్నదని తెలిపింది. దీంతోపాటు రూ.12.89-19.13 లక్షల లోపు ధర కలిగిన 2021 వెర్షన్‌ హెక్టార్‌ను కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న చిన్న ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి సంస్థ ప్రవేశించడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ ఏడాది చివర్లో చిన్న ఎస్‌యూవీని విడుదల చేయబోతున్నట్లు ఎంజీ మోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా తెలిపారు. గతేడాది ఇండస్ట్రీ 18 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, అదే సంస్థ 77 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నదని, 2021లో మాత్రం ఇండస్ట్రీ 15-20 శాతం వృద్ధి అంచనావేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత సంవత్సరంలో సంస్థ 50 వేల యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.  

VIDEOS

logo