శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 19, 2020 , 19:15:00

2021లో విపణిలోకి ఎంజీ మోటార్స్‌ 7 సీటర్‌ హెక్టార్ ప్లస్‌

2021లో విపణిలోకి ఎంజీ మోటార్స్‌ 7  సీటర్‌ హెక్టార్ ప్లస్‌

న్యూఢిల్లీ: ఎంజీ మోటార్స్‌ ఇండియా 2021  జనవరిలో సెవెన్‌ సీటర్‌ హెక్టర్‌ ప్లస్‌ మోడల్‌ కారును మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు శనివారం ప్రకటించింది. ఆరు సీట్ల ఎంజీ హెక్టార్‌ ప్లస్‌ మోడల్‌ కారును గత జూలైలో ఆవిష్కరించింది. ఎంజీ హెక్టార్‌ ఆరు సీటర్ల కారు ధర రూ. 13.49 లక్షల నుంచి రూ.18.54 లక్షలు పలుకగా, గత ఆగస్టులో ఎస్‌యూవీ మోడల్‌ కారును తీసుకొచ్చింది ఎంజీ మోటార్స్‌ ఇండియా. సదరు ఎస్‌యూవీ మోడల్‌ కారు ధర రూ.13.74 లక్షల నుంచి రూ.18.69 లక్షల వరకు పలుకుతున్నది. 

ఎంజీ మోటార్స్‌ తన హెక్టార్‌ ప్లస్‌ కారులో పవర్‌ ట్రైన్‌, ట్రాన్సిమిషన్‌ ఆప్షన్లను కూడా చేర్చనున్నది. 6-స్పీడ్‌ ఎంటీ లేదా 6-స్పీడ్‌ డీటీసీ సామర్థ్యంతోపాటు 1.5 లీటర్ల టర్బో పెట్రోల్‌ (143 పీఎస్‌ అండ్‌ 250 ఎన్‌ఎం) ఆప్షన్‌ కూడా జత కలిపింది. ఇక 6-స్పీడ్‌ ఎంటీతోపాటు 1.5-లీటర్ల పెట్రోల్‌ హైబ్రీడ్‌ (143 పీఎస్‌ అండ్‌ 250 ఎన్‌ఎం), 6-స్పీడ్‌ ఎంటీతోపాటు 2.0-లీటర్ల టరబో డీజిల్‌ (170 పీఎస్‌ అండ్ 350 ఎన్‌ఎం) ఆప్షన్లలో ఇంజిన్లు ఇందులో చేర్చారు.

ఎంజీ మోటార్స్‌ హెక్టర్‌ ప్లస్‌ సెవెన్‌ సీటర్‌ కారు నాలుగు వేరియంట్లలో వినియోగదారులకు లభ్యం కానున్నది. అవి స్టైల్‌, సూపర్‌, స్మార్ట్‌, షార్మ్‌ మోడళ్లలో లభిస్తాయి. వేరియంట్ల వారీగా ఎంజీ హెక్టార్‌ ప్లస్‌ ధరలు పరిశీలిద్దాం..  

- హెక్టార్ ప్లస్‌ పెట్రోల్‌ - స్టైల్‌ ఎంటీ రూ.13.74 లక్షలు

- హెక్టార్ ప్లస్‌ పెట్రోల్‌ - స్మార్ట్‌ డీసీటీ - రూ. 16.70 లక్షలు

- హెక్టార్ ప్లస్‌ పెట్రోల్‌ - షార్ప్‌ డీసీటీ - రూ. 18.36 లక్షలు

- హెక్టార్ ప్లస్‌ పెట్రోల్‌ - హైబ్రీడ్‌ షార్ప్‌ ఎంటీ - రూ.17.39 లక్షలు

-  హెక్టార్‌ ప్లస్‌ డీజిల్‌ స్టైల్‌ ఎంటీ - రూ. 14.90 లక్షలు

-  హెక్టార్‌ ప్లస్‌ డీజిల్‌ సూపర్‌ ఎంటీ - రూ. 15.70 లక్షలు

-  హెక్టార్‌ ప్లస్‌ డీజిల్‌ స్మార్ట్‌ ఎంటీ - రూ. 17.20 లక్షలు

-  హెక్టార్‌ ప్లస్‌ డీజిల్‌ షార్ప్‌ ఎంటీ - రూ. 18.69 లక్షలు

క్రోమ్‌ ఫ్రంట్‌ గ్రిల్లేతోపాటు ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్‌, ఎల్‌ఈడీ ఫాగ్‌ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌ హీటెడ్‌ ఓఆర్వీఎంఎస్‌, రూఫ్‌ రెయిల్స్‌, షార్క్‌ ఫిన్‌ యాంటేనా, డ్యుయల్‌ టోన్‌ మెషిన్డ్‌ అల్లాయ్‌ వీల్స్‌ తదితర ఫీచర్లు ఎంజీ హెక్టార్‌ ప్లస్‌ సెవెన్‌ సీటర్ కారులో లభ్యం అవుతాయి. 

ఎంజీ హెక్టార్‌ ప్లస్‌ కారు మధ్య వరుసలో కెప్టెన్‌ సీట్లు లభిస్తాయి. ఆరు సీట్ల ఎస్‌యూవీ కారులో తొలి రెండు వరుసల్లో నలుగురు పెద్దలు, మూడో వరుసలో ఇద్దరు పిల్లలు హాయిగా కూర్చునే వెసులుబాటు కలిగి ఉంది. 10.4 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఏవీఎన్‌ సిస్టమ్‌, ఇన్‌స్రుమెంట్‌ క్లస్టర్‌లో ఏడంగుళాల కలర్డ్‌ డిజిటల్‌ ఎంఐడీతోపాటు 8 - కలర్ ఆంబియెంట్‌ లైటింగ్‌, డ్యూయల్‌ పేన్‌ పనోరమిక్‌ రూఫ్‌ కలిగి ఉంటుంది. ఈ కారుకూ పవర్డ్ టెయిల్‌ గేట్‌ ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

తాజావార్తలు


logo