ఎంజీ మోటర్ బుధవారం దేశీయ మార్కెట్కు ఆస్టర్ మోడల్ మధ్యశ్రేణి ఎస్యూవీని పరిచయం చేసింది. అత్యాధునిక హంగులతో వచ్చిన ఈ కారును.. ఈ నెల 19 నుంచి కంపెనీ షోరూంలలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. రాబోయే 2-3 వారాల్లో ధర, డెలివరీ తేదీలను ప్రకటిస్తామని సంస్థ దేశీయ విభాగం అధ్యక్షుడు రాజీవ్ చబ్బా తెలియజేశారు.