గురువారం 02 ఏప్రిల్ 2020
Business - Mar 04, 2020 , 00:00:19

మార్కెట్లోకి బెంజ్‌ సరికొత్త కౌప్‌

మార్కెట్లోకి బెంజ్‌ సరికొత్త కౌప్‌
  • ధర రూ.63.70 లక్షలు

ముంబై, మార్చి 3: మెర్సిడెజ్‌-బెంజ్‌..దేశీయ మార్కెట్లోకి జీఎల్‌సీ కౌప్‌ మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ నూతన జీఎల్‌సీ కౌప్‌ మోడల్‌ 300డీ 4మ్యాటిక్‌ డీజిల్‌, 300 4మ్యాటిక్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ కార్లు రూ.62.70 లక్షలు మొదలుకొని రూ.63.70 లక్షల లోపు లభించనున్నాయి.  డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన కారు కేవలం 6.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుండగా, అలాగే పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన కారు 6.3 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నదని కంపెనీ ఎండీ, సీఈవో మార్టిన్‌ స్కేవెంక్‌ తెలిపారు. 


logo
>>>>>>