మంగళవారం 14 జూలై 2020
Business - Jun 30, 2020 , 00:25:39

పీపీఈ సూట్ల ఎగుమతికి ఓకే

పీపీఈ సూట్ల ఎగుమతికి ఓకే

  • నెలకు 50 లక్షల యూనిట్లు మించరాదన్న కేంద్రం

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 నుంచి రక్షణ కల్పించే పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) మెడికల్‌ సూట్ల (కవరాల్స్‌) ఎగుమతి నిబంధనలను కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా సడలించింది. ఇకపై వీటిని ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఎగుమతులు నెలకు 50 లక్షల యూనిట్లు మించకూడదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్టీ) సోమవారం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. పీపీఈ కిట్లలోని ఇతర వస్తువుల ఎగుమతులపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. 


logo