గురువారం 25 ఫిబ్రవరి 2021
Business - Jan 23, 2021 , 19:29:08

2020 బెస్ట్‌ సెల్లింగ్‌ మారుతి ‘స్విఫ్ట్‌’

2020 బెస్ట్‌ సెల్లింగ్‌ మారుతి ‘స్విఫ్ట్‌’

న్యూఢిల్లీ: గ‌తేడాది ప్ర‌యాణికుల కార్ల విక్ర‌యాల్లో అతిపెద్ద ప్ర‌యాణికుల కార్ల త‌యారీ సంస్థ మారుతి హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్ స్విఫ్ట్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. 2020లో 1,60,700 మారుతి స్విఫ్ట్ మోడ‌ల్ కారు  యూనిట్లు అమ్ముడ‌య్యాయి. అలాగే 2005లో విప‌ణిలో అడుగు పెట్టిన స్విఫ్ట్‌.. 2020 నాటికి 23 ల‌క్ష‌లు అమ్ముడైన మోడ‌ల్‌గా రికార్డు నెల‌కొల్పింది. 2010లో ఐదు ల‌క్ష‌ల మైలురాయిని దాటిన స్విఫ్ట్‌.. 2013లో 10 ల‌క్ష‌ల‌, 2016లో 15 ల‌క్ష‌ల మైలురాయిని అధిగ‌మించింద‌ని మారుతి శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌ల‌నో తెలిపింది. 

గ‌త 15 వ‌సంతాలుగా బెస్ట్ సెల్లింగ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడ‌ల్ కారుగా స్విఫ్ట్ నిలిచింద‌ని మారుతి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ‌శాంక్ శ్రీవాత్స‌వ పేర్కొన్నారు. 23 ల‌క్ష‌ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిగి ఉన్నందుకు ఆనందంగా ఉంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌తికూల ప్ర‌భావం చూపినా, స్విఫ్ట్ బ్రాండ్ కారు 1,60,700 యూనిట్లు అమ్ముడు పోవ‌డంతోపాటు టాప్ పెకింగ్ ఆర్డ‌ర్ బ్రాండ్‌గా నిలిచింద‌ని వ్యాఖ్యానించారు. 

త‌మ స్విఫ్ట్ కారు క‌స్ట‌మ‌ర్ల‌లో 53 శాతానికి పైగా 35 ఏండ్ల‌లోపు వ‌య‌స్కులేన‌ని మారుతి మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ‌శాంక్ శ్రీవాత్స‌వ వెల్ల‌డించారు. టెక్కీసావీ ఫీచ‌ర్లు, వాల్యూ ఫ‌ర్ మ‌నీ ఆఫ‌రింగ్ అండ్ స్పోర్టీ డిజైన్ గ‌ల కారుగా గుర్తింపు తెచ్చుకున్న‌ద‌న్నారు. 2005లో తొలి త‌రం స్విఫ్ట్ మోడ‌ల్ కారు విప‌ణిలోకి రాగా, అప్‌డేట్ వ‌ర్ష‌న్ స్విఫ్ట్ మోడ‌ల్.. 2018లో  జ‌రిగిన ఆటో ఎక్స్‌పోలో ప్ర‌ద‌ర్శించారు. 

గతేడాది అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి ఆల్టో రెండో స్థానంలో ఉంది. ఇక సేల్స్‌లో టాప్‌-10లో ఉన్న మోడళ్లలో ఏడు మారుతి మోడ‌ల్ కార్లే కావడం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. బాలెనో, వ్యాగనార్‌, డిజైర్‌, ఎకో, బ్రెజా టాప్‌ సెల్లర్ల జాబితాలో ఉండగా.. హ్యుండాయ్‌ క్రెటా ఏడో స్థానంలో, కియా సెల్టోస్‌ ఎనిమిద‌వ‌, హ్యుండాయ్‌ గ్రాండ్‌ ఐ10 తొమ్మిదో స్థానంలో నిలిచాయి. 

హ్యాచ్‌బ్యాక్ బ్రాండ్ కార్ల‌లో స్విఫ్ట్‌కు హ్యుండాయ్ గ్రాండ్ ఐ10, ఫోర్డ్ ఫిగో పోటీగా నిలిచాయి. స్విఫ్ట్ 1,60,700 యూనిట్లు విక్ర‌యిస్తే, హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 సుమారు 82 వేలు, ఫోర్డ్ ఫిగ్ కేవ‌లం 2,600 యూనిట్లు మాత్ర‌మే విక్ర‌యించ‌గ‌లిగింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo