శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Business - Jan 14, 2020 , 01:03:05

5 లక్షలు దాటిన బ్రెజ్జా విక్రయాలు

5 లక్షలు దాటిన బ్రెజ్జా విక్రయాలు

న్యూఢిల్లీ, జనవరి 13: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి చెందిన కాంప్యాక్ట్ ఎస్‌యూవీ విటారా బ్రెజ్జా మరో రికార్డును సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి విడుదలైన నాలుగేండ్లలో 5 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. 2016లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఈ కారు ఆ తర్వాతి క్రమంలో దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ. సుజుకీ కోర్ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఈ కారును దేశీయ వినియోగదారులకు నచ్చే విధంగా డిజైన్ చేసినట్లు మారుతి ఈడీ(మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. కేవలం 47 నెలల్లోనే ఐదు లక్షల విటారా బ్రెజ్జా యూనిట్లు అమ్ముడవడం విశేషమన్నారు.


logo