సోమవారం 30 మార్చి 2020
Business - Jan 28, 2020 , 00:06:21

ఆల్టోలో సీఎన్‌జీ వెర్షన్‌ ధర రూ.4.32 లక్షలు

ఆల్టోలో సీఎన్‌జీ వెర్షన్‌ ధర రూ.4.32 లక్షలు

కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ ఆల్టోను బీఎస్‌-6 ప్రమాణాలతో సీఎన్‌జీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.4.32 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి. ఈ ఆల్టో ఎస్‌-సీఎన్‌జీ కారు కిలో గ్యాస్‌కు 31.59 కిలోమీటర్ల మైలేజి ఇవ్వనున్నది. కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ ఆల్టో బీఎస్‌-6 ఎస్‌-సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(మార్కెటింగ్‌) శశాంక్‌ శ్రీవాత్సవ తెలిపారు. చమురు దిగుమతులను నియంత్రించడానికి, సహజ వాయువు వాడకాన్ని పెంపొందించడానికి కేంద్రం కృత నిశ్చయంతో ఉన్నదని, 2030 నాటికి 15 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించాలని చూస్తున్నది.  


logo