సోమవారం 06 ఏప్రిల్ 2020
Business - Feb 19, 2020 , 00:11:05

బీఎస్‌-6తో ఇగ్నిస్‌

బీఎస్‌-6తో ఇగ్నిస్‌
  • రూ.4.89- 7.19 లక్షల మధ్యలో ధర

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఇండియా..దేశీయ మార్కెట్లోకి ఒక్కొక్కటి బీఎస్‌-6 వెర్షన్లను విడుదల చేస్తున్నది. తాజాగా ప్రీమియం కాంప్యాక్ట్‌ కారు ఇగ్నిస్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు రూ.4.89 లక్షల నుంచి రూ.7.19 లక్షల మధ్యలో లభించనున్నది. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు మాన్యువల్‌, ఆటో గేర్‌ షిఫ్ట్‌(ఏజీఎస్‌) ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం కొనుగోలుదారుడికి ఉందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎస్‌యూవీ లాగా తీర్చిదిద్దిన ఈ ఇగ్నిస్‌ కారు వినియోగదారులను ఆకట్టుకుంటుందన్న ఆశాభావాన్ని కంపెనీ ఎండీ, సీఈవో కెనిచి అయుకవా వ్యక్తంచేశారు. ఆరు మోడళ్లలో లభించనున్న ఈ కారు మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన వాహనం రూ.4.89-6.73 లక్షల మధ్యలోను, ఏజీఎస్‌ ఆప్షన్‌ మోడల్‌ రూ.6.13-7.19 లక్షల మధ్యలో లభించనున్నదని పేర్కొంది. 


logo