ఈ మధ్య కాలంలో కుర్ర హీరోలు స్టన్నింగ్ లుక్స్‌లో కనిపిస్తూ షాకిస్తున్నారు. భారీగా కండలు పెంచి షర్ట్‌లెస్ ఫొటో షూట్స్ చేస్తున్నారు. ఈ పిక్స్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తన ఇన్‌స్టాగ్రాములో జిమ్‌లో కండలు చూపిస్తూ దిగిన ఫొటోలను షేర్ చేశాడు. తన తాజా చిత్రం భేడియా సినిమా కోసం వరుణ్ ధావన్ ఈ లుక్‌లోకి మారినట్టు తెలుస్తుంది. అయితే సర్ప్రైజింగ్ లుక్‌లో వరుణ్ ధావన్‌ని చూసిన సెలబ్స్, అభిమానులు ఆయన శరీర సౌష్టవంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ అయితే వరుణ్ బాడీని చూసి ఆశ్చర్యపోయి టెర్రిఫిక్ అంటూ కామెంట్ పెట్టారు.
బేడియా చిత్రం హరర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుండగా, ఇందులో కృతి సనన్ కథానాయికగా నటిస్తుంది. కోవిడ్ సమయంలోను పలు జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో షూటింగ్ జరుగుతున్న టైంలో అభిమానులు చాలా మంది అక్కడికి వచ్చారు. అప్పుడు వరుణ్ ధావన్ కరోనా టైంలోఇలా గుంపులుగా రావొద్దని వేడుకున్నాడు.