ఈ కార్లంటే వినియోగదారులకు యమ క్రేజు

న్యూఢిల్లీ : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ మోడల్ కార్లకు డిమాండ్ పుష్కలంగా ఉంది. ప్రత్యేకించి మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా, హోండా జాజ్, టాటా ఆల్ట్రోజ్, వోక్స్ వ్యాగన్ పోలో, హ్యుండాయ్ న్యూ ఐ 20 మోడల్ హ్యాచ్బ్యాక్ కార్లంటే వినియోగదారులు మోజు పడుతున్నారు. గత నెలలో మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ ఐ 20, టాటా ఆల్ట్రోజ్ మోడల్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లు అత్యధికంగా అమ్ముడయ్యాయి.
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు బాలెనో గత నెలలో 17,872 యూనిట్లు అమ్ముడయ్యాయి. బాలెనో మోడల్ కారు రూ.5.64 లక్షల నుంచి రూ.8.96 లక్షల మధ్య వినియోగదారులకు అందుబాటులో ఉంది. 1.2 లీటర్ల వీవీటీ పెట్రోల్ (93 పీస్ అండ్ 113 ఎన్ఎం), వీవీటీ స్మార్ట్ హైబ్రీడ్ పెట్రోల్ (90 పీఎస్ అండ్ 113ఎన్ఎం) మోడళ్లలో బాలెనో లభిస్తున్నది.
మారుతి సుజుకి బాలెనో తర్వాత అత్యధికంగా ‘న్యూ హ్యుండాయ్ ఐ20’ మోడల్ కారు 9096 యూనిట్లు అమ్ముడయ్యింది. న్యూ ఐ 20 మోడల్ కారు మూడు పవర్ ట్రైన్ చాయిస్ల్లో లభిస్తున్నది. 1.2 లీటర్ల కప్పా పెట్రోల్, 1.0 లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్. 1.2 లీటర్ల యూ2 సీఆర్డీఐ డీజిల్ మోడళ్లలో లభిస్తుంది. న్యూ హ్యుండాయ్ ఐ 20 మోడల్ కారు రూ.6.80 లక్షల నుంచి రూ.11.33 లక్షల మధ్య అందుబాటులో ఉన్నది.
టాటా మోటార్స్ వారి ఆల్ట్రోజ్ మోడల్ కారు అత్యధికంగా 6,260 మంది కొనుగోలు చేశారు. దీని ధర రూ.5.44 లక్షల నుంచి రూ. 9.09 లక్షలు పలుకుతున్నది. ఇది పలు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నది. 1.2 లీటర్ల రెవోట్రోన్ పెట్రోల్, 1.5 లీటర్ల టర్బో చార్జ్డ్ రెవొట్రోన్ డీజిల్ మోడల్ కారు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.