గురువారం 28 మే 2020
Business - Apr 09, 2020 , 06:02:35

ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నమారుతి

ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నమారుతి

న్యూఢిల్లీ : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. మార్చి నెలలోనూ ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నది. గత నెలలో సంస్థ కేవలం 92,540 యూనిట్ల వాహనాలను మాత్ర మే ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన 1,36,201 యూనిట్లతో పోలిస్తే 32 శాతం తక్కువ. వీటిలో ప్యాసింజర్‌ వాహనాల ఉత్పత్తి 1,35,236 ల నుంచి 91,602లకు పడిపోయాయి. 


logo