గురువారం 28 మే 2020
Business - May 06, 2020 , 17:53:07

తెరుచుకున్న మారుతీ షోరూంలు

తెరుచుకున్న మారుతీ షోరూంలు

న్యూఢిల్లీ: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ  మారుతి సుజుకీ ఎట్టకేలకు దేశవ్యాప్తంగా 600 షోరూంలు తెరిచింది. కరోనా వైరస్ కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన షోరూంలను తిరిగి ప్రారంభించినట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో బుకింగ్ చేసుకున్న వాహనాలను సైతం వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. తెరుచుకున్న వాటిలో 474 ఎరీనా ఔట్‌లెట్లు  ఉండగా, 80 నెక్సా డీలర్లు, 45 కమర్షియల్ వాహన ఔట్‌లెట్లున్నాయి.

కార్లను హోండెలివరీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం కస్టమర్లకు అవసరమైన వాహనాలు అందించేందుకు సరిపడా నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది.  ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 1,960 నగరాల్లో 3,080 ఔట్‌లెట్లున్నాయి.


logo