మంగళవారం 31 మార్చి 2020
Business - Mar 10, 2020 , 11:46:36

బీఎస్‌-6 కార్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్న మారుతీ సుజుకీ..!

బీఎస్‌-6 కార్లపై భారీ  తగ్గింపు ధరలను అందిస్తున్న మారుతీ సుజుకీ..!

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన వాహనాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అనేక కార్లు, టూవీలర్‌ తయారీకంపెనీలు బీఎస్‌-4 వాహనాలపై ఇప్పటికే భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అయితే మారుతీ సుజుకీ మాత్రం బీఎస్‌-6 ప్రమాణాలు కలిగిన పలు కార్లపై డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ ఆఫర్లు ఈ నెల 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఆ కంపెనీ తెలిపింది. ఇక మారుతీ సుజుకీ తన బీఎస్‌-6 కార్లపై అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

మారుతీ సుజుకీ సియాజ్‌... 

ఈ కారును కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు రూ.45వేల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. రూ.10వేల క్యాష్‌ డిస్కౌంట్‌తోపాటు రూ.25వేల వరకు బోనస్‌ ఎక్స్‌ఛేంజ్‌, రూ.10వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఇక ఈ కారుకు చెందిన అన్ని వేరియెంట్లపై ఎంపిక చేసిన ఆఫర్లను అందిస్తున్నారు. ఈ కారు 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. రూ.8.31 లక్షల ప్రారంభ ధరకు ఈ కారు అందుబాటులో ఉంది. గరిష్టంగా ఈ కారు ధర రూ.11.09 లక్షలుగా ఉంది. 

మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6... 

మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్‌6 ఎంపీవీ కారుపై రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌ను అందిస్తున్నారు. ఇందులో 6 సీట్లు ఉంటాయి. 2 గేర్‌బాక్స్‌ ఆప్షన్లు ఉంటాయి. రూ.9.84 లక్షల ప్రారంభ ధరకు ఈ కారు వినియోగదారులకు అందుబాటులో ఉంది. 

మారుతీ సుజుకీ బలెనో... 

ఈ కారుపై రూ.20వేల వరకు  డిస్కౌంట్‌, రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ.5వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ కారు రూ.5.70 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉండగా, దీని గరిష్ట ధర రూ.9.03 లక్షలుగా ఉంది. 

మారుతీ సుజుకీ ఇగ్నిస్‌... 

ఈ కారుకు చెందిన బీఎస్‌-6 వేరియెంట్‌ 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. భిన్న రకాల వేరియెంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారుకు చెందిన సిగ్మా వేరియెంట్‌పై రూ.20వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే డెల్టా, జెటా, ఆల్ఫా ట్రిమ్‌ వేరియెంట్లపై రూ.10వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇక ఇవే కాకుండా రూ.15వేల వరకు ఎక్స్‌ఛేంజ్‌ బోనస్‌, రూ.5వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. 


logo
>>>>>>