బుధవారం 03 జూన్ 2020
Business - Apr 21, 2020 , 11:53:16

న‌ష్టాల్లో కొన‌సాగుతున్నమార్కెట్లు

న‌ష్టాల్లో కొన‌సాగుతున్నమార్కెట్లు

ముంబై: గ‌త రెండు రోజులుగా లాభాల్లో న‌డిచిన‌ దేశీయ స్టాక్ మార్కెట్లు మ‌ళ్లీ న‌ష్టాల బాట‌ప‌ట్టాయి. సెన్సెక్స్ 954 పాయింట్లు కోల్పోయి 30,693  పాయింట్ల న‌ష్టంతో కొన‌సాగుతుంది. నిఫ్టీ 267 పాయింట్ల న‌ష్టంతో 8,994 పాయింట్ల ద‌గ్గ‌ర ట్రేడ‌వుతుంది. అటు డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ రూ.75.91 వ‌ద్ద స్థిర‌ప‌డింది. డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌, స‌న్‌ఫార్మా, బ్రిటానియా, నెస్లీ, ఏషియ‌న్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉండ‌గా.. మారుతి సుజుకి, హిందాల్కో, టాటాస్టీల్‌, వేదాంత షేర్లు నష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి.


logo