శనివారం 30 మే 2020
Business - Apr 28, 2020 , 10:18:20

లాభాల‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

లాభాల‌తో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై :నిన్న లాభాల‌తో ప‌రుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవ్వాళ జోరు సాగిస్తున్నాయి. దేశీయ మార్కెట్లు ఇవాళ కూడా లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. ఆరంభ‌మైన కొద్దిసేప‌ట్లో న‌ష్టాల్లోకి వెళ్లిన‌...మ‌ళ్లీ తిరిగి పుంజుకున్నాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు లాభ‌ప‌డి..32,097 ద‌గ్గ‌ర కొన‌సాగుతుండ‌గా.. నిఫ్టీ 105 పాయింట్ల గెయిన్‌తో 9,387 పాయింట్ల వ‌ద్ద ట్రేడ్ అవుతోంది. ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్‌, జీ ఎంట‌ర్టైన్‌మెంట్, గెయిల్‌, టెక్ మ‌హీంద్రా, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ప‌య‌నిస్తుండ‌గా.... రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌, వేదాంత‌, స‌న్‌ఫార్మా, బ్రిటానియా, విప్రో షేర్లు న‌ష్టాల్లో సాగుతున్నాయి.


logo