ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Dec 31, 2020 , 01:18:26

టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌గా మనోహర్‌ రెడ్డి

టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌గా మనోహర్‌ రెడ్డి

హైదరాబాద్‌: టై (ది ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌) హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌గా మనోహర్‌రెడ్డి నియమితులయ్యారు. 2021 ఏడాదికిగాను ఆయన ప్రెసిడెంట్‌గా వ్యవహరించనున్నారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా సురేశ్‌ రాజు ఎంపికయ్యారు.  ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలకు చెందిన 15 వేల మంది అంతర్జాతీయ వ్యాపారవేత్తలు టైలో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న శ్రీధర్‌ పిన్నపురెడ్డి పదవీ కాలం గురువారంతో ముగియనున్నది. మనోహర్‌ రెడ్డి ప్రస్తుతం ఫ్యూజీ ఇండస్ట్రీ వ్యవస్థాపక సీఈవోగా వ్యవహరిస్తున్నారు. 

VIDEOS

logo