మార్చిలో 6.8 శాతం వృద్ధి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30:కీలక రంగాలు మళ్లీ గాడిలో పడ్డాయి. గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరుస్తున్న ఎనిమిది కీలక రంగాలు మార్చి నెలలో ఏకంగా 6.8 శాతం వృద్ధిని సాధించాయి. అంతక్రితం ఏడాది కీలక రంగాలు మైనస్ 8.6 శాతం వృద్ధి నమోదైంది. కేంద్ర పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం సహజ వాయువు(12.3 శాతం), స్టీల్(23 శాతం), సిమెంట్(32.5 శాతం), విద్యుత్(21.6 శాతం) చొప్పున పనితీరు కనబరిచాయి.