శుక్రవారం 05 జూన్ 2020
Business - May 20, 2020 , 00:25:30

మహీంద్రా కొత్త ఫైనాన్స్‌ స్కీములు

 మహీంద్రా కొత్త ఫైనాన్స్‌ స్కీములు

  • కరోనా వారియర్లు, వైద్యులు, పోలీసులు, మహిళలకు ప్రత్యేక రాయితీలు

ముంబై, మే 19: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తమ వాహన కొనుగోలుదార్ల కోసం కొత్త ఫైనాన్స్‌ స్కీములను అందుబాటులోకి తెచ్చింది. కరోనా వారియర్లు, మహిళలు, వైద్యులు, పోలీసులకు ఎనిమిదేండ్ల వ్యవధి కలిగిన రుణ సదుపాయం, ఈఎంఐ చెల్లింపులపై 90 రోజుల మారటోరియం, 100 శాతం ఆన్‌రోడ్‌ ఫైనాన్సింగ్‌, ప్రాసెసింగ్‌ ఫీజులో 50 శాతం రాయితీ లాంటి ఆఫర్లను అందజేయనున్నట్టు ప్రకటించింది. మహిళా కొనుగోలుదారులకు రుణ మొత్తంలో 10 బేసిస్‌ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది. బీఎస్‌-6 వాహనాలను కొనుగోలుచేసే కస్టమర్లు బీఎస్‌-4 వాహన ధరలకు సమానమైన ఈఎంఐలు చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఎస్‌యూవీలను కొనుగోలుచేసే కస్టమర్లు తమ ఈఎంఐ చెల్లింపులను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించవచ్చని వివరించింది. మరో స్కీములో ప్రతి లక్ష రూపాయల వాహన రుణంపై ఈఎంఐ రూ.1,234 కంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నది.  


logo