ఆదివారం 07 మార్చి 2021
Business - Jan 29, 2021 , 18:08:08

మహీంద్ర ఎక్స్‌యూవీ ౩౦౦ : ఎన్‌సీఏపీ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌

మహీంద్ర ఎక్స్‌యూవీ ౩౦౦ : ఎన్‌సీఏపీ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌

న్యూఢిల్లీ : భారత్‌లో తయారయ్యే మహీంద్ర ఎక్స్‌యూవీ 300కి ఆఫ్రికన్‌ మార్కెట్‌లో అరుదైన ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ లభించింది. దక్షిణాఫ్రికాలో గ్లోబల్‌ ఎన్‌సీఏపీ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ పొందిన తొలివాహనంగా మహీంద్ర ఎక్స్‌యూవీ 300 నిలిచింది. ఈ వాహనంలో డ్రైవర్‌తో పాటు ముందు సీటులో ప్రయాణించే పాసింజర్‌లకు ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు, పిల్లల కోసం ఐసోఫిక్స్‌ మౌంట్స్‌, సీట్‌బెల్ట్‌ ప్రీ-టెన్షనర్స్‌, యాంటీ లాంక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌లు స్టాండర్డ్‌ ఫిట్‌మెంట్స్‌గా వచ్చాయి.

గ్లోబల్‌ ఎన్‌సీఏపీ ఇచ్చిన నివేదిక ప్రకారం ముందువరసలో కూర్చునే పెద్దల భద్రతలో ఎక్స్‌యూవీ 300కు మొత్తం 17కు గాను  16.42 స్కోర్‌ లభించింది. దీనికి తోడు ఎక్స్‌యూవీ ౩౦౦ బాడీ పటిష్టంగా ఉండటంతో పాటు మరింత లోడింగ్‌కు అనువుగా ఉంది. ఈ వాహనం పిల్లల భద్రత విషయంలో 44కు 37.44 స్కోర్‌ సాధించింది. 

VIDEOS

logo