శనివారం 08 ఆగస్టు 2020
Business - Jul 30, 2020 , 01:07:24

కస్టమర్లకు మహీంద్రా ప్రత్యేక ఆఫర్లు

కస్టమర్లకు మహీంద్రా  ప్రత్యేక ఆఫర్లు

న్యూఢిల్లీ: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ కస్టమర్ల కోసం బుధవారం సరికొత్త చౌక రుణ పథకాలను పరిచయం చేసింది. అన్ని వాహనాల కొనుగోళ్లకు ఈ రుణాలు వర్తించనున్నాయి. కార్లు ఇతరత్రా వ్యక్తిగత వాహనాలపై రుణాలు లక్షకు రూ.899 కనిష్ఠ ఈఎంఐకే లభిస్తాయని ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. కార్ల యాక్ససరీస్‌ కోసం ఎక్స్‌షోరూం ధరలో 10 శాతం వరకు కలుపుకుని రుణ సౌకర్యాన్ని కల్పిస్తామని పేర్కొన్నది. అంతేగాక రెగ్యులర్‌ ఈఎంఐల కంటే ఈ రుణాల్లోని ఈఎంఐలు తొలి 9 నెలలు 50 శాతం తక్కువగానే నిర్ణయించుకోవచ్చని స్పష్టం చేసింది. మొదటి 6 నెలల ఈఎంఐ.. రెగ్యులర్‌తో పోల్చితే 76 శాతం తక్కువకే పొందే వీలు కూడా ఉందని చెప్పింది. అలాగే బొలెరో పికప్‌, బొలెరో మ్యాక్సీ ట్రక్‌ల కోసం ఏడేండ్ల వరకు రుణ సదుపాయం ఇస్తామని సంస్థ ఈ సందర్భంగా ప్రకటించింది. 


logo