సోమవారం 01 మార్చి 2021
Business - Dec 15, 2020 , 21:26:11

జనవరి నుంచి మహీంద్రా కార్ల ధరలు పైపైకి..

జనవరి నుంచి మహీంద్రా కార్ల ధరలు పైపైకి..

న్యూఢిల్లీః ఇతర ఆటోమొబైల్‌ సంస్థల బాటలో మహీంద్రా అండ్‌ మహీంద్రా పయనిస్తోంది. 2021 జనవరి ఒకటో తేదీ నుంచి తమ ప్యాసింజర్‌, కమర్షియల్‌ వాహనాల ధరలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. స్కార్పియో, బొలెరో మోడల్‌ వాహనాల తయారీ సంస్థ అయిన మహీంద్రా అండ్‌ మహీంద్రా.. ఏయే మోడల్‌ కార్ల ధరలు ఏ స్థాయిలో పెంచుతున్న సంగతిని వెల్లడించలేదు. 

కమోడిటీ ధరలు, ఇతర ఇన్‌ఫుట్‌ ధరలు పెరగడంతో తమ వాహనాల ధరలు పెంచక తప్పడం లేదని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. దాదాపు దేశంలోని అన్ని ఆటోమొబైల్‌ సంస్థలు వచ్చే నూతన సంవత్సరం ప్రారంభం నుంచి తమ కార్లు, ఇతర వాహనాల ధరలు పెంచనున్నట్లు వెల్లడించాయి.  అలాగే తమ వద్ద నున్న నిల్వలను విక్రయించడానికి ఆయా ఆటోమొబైల్‌ సంస్థలు వినియోగదారులకు ఇన్సెంటివ్‌లను ప్రకటించాయి. 

దేశంలోకెల్లా ప్రయాణికుల కార్ల తయారీలో మొదటి స్థానంలో ఉన్న మారుతి సుజుకి వచ్చే నెల ప్రారంభం నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు తెలిపింది. దక్షిణ కొరియా ఆటోమేజర్లు హ్యుండాయ్‌, కియా మోటార్స్‌ సంస్థలు కూడా తమ వాహనాల ధరలను పెంచుతామని చెప్పినట్లు వార్తా కథనాలు వచ్చాయి. 

p>లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo