శనివారం 06 జూన్ 2020
Business - Apr 07, 2020 , 23:20:57

మహీంద్రా ఉచిత క్యాబ్స్‌

మహీంద్రా ఉచిత క్యాబ్స్‌

-కరోనా రోగుల కోసం హైదరాబాద్‌లో అందుబాటులోకి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: మహీంద్రా లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లో కరోనా రోగుల కోసం ఉచిత అత్యవసర క్యాబ్‌ సేవలను ప్రారంభించింది. రాచకొండ కమిషనరేట్‌ సహకారంతో హైదరాబాద్‌, సైబరాబాద్‌, సంగారెడ్డి, రాచకొండ పరిధుల్లో ఈ సర్వీసులను మంగళవారం అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలియజేసింది. ఈ క్యాబ్‌లు 24 గంటలు నడుస్తాయని సంస్థ ఎండీ, సీఈవో రాంప్రవీణ్‌ స్వామినాథన్‌ వెల్లడించారు. 


logo