సోమవారం 08 మార్చి 2021
Business - Jan 13, 2021 , 02:22:26

ఎస్బీఐతో మహీంద్రా లైఫ్‌స్పేస్‌ జట్టు

ఎస్బీఐతో మహీంద్రా లైఫ్‌స్పేస్‌ జట్టు

న్యూఢిల్లీ, జనవరి 12: రియల్టీ సేవల సంస్థ మహీంద్రా లైఫ్‌స్పేస్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌..బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో జతకట్టింది. ఇరు సంస్థల ఉద్యోగులకు గృహ రుణాలు మరింత వేగవంతంగా అందించడంతోపాటు ప్రత్యేక రాయితీకి రుణాలు ఇచ్చేందుకు ఈ ఒప్పందం దోహదం చేయనున్నది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య మంగళవారం అంగీకార ఒప్పందం జరిగింది కూడా. మహీంద్రా లైఫ్‌స్పేస్‌ ఎండీ, సీఈవో అరవింద్‌ సుబ్రమణియన్‌ మాట్లాడుతూ..మహీంద్రాకు చెందిన గృహాలు కొనుగోలు చేసే వినియోగదారులతోపాటు ఉద్యోగులకు అత్యంత వేగంగా రుణాలు అందించాలనే ఉద్దేశంతో ఎస్బీఐతో జత కట్టునట్లు చెప్పారు. కంపెనీకి ఎంఎంఆర్‌, బెంగళూరు, పుణె, చెన్నై, నాగపూర్‌ల వద్ద ఉన్న రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులకు గృహ రుణాలు ఇవ్వనున్నారు. 

VIDEOS

logo