ఆదివారం 24 మే 2020
Business - Mar 08, 2020 , 17:48:04

మహీంద్రా బంపర్‌ ఆఫర్‌.. కార్లపై భారీ తగ్గింపు ధరలు..

మహీంద్రా బంపర్‌ ఆఫర్‌.. కార్లపై భారీ తగ్గింపు ధరలు..

న్యూఢిల్లీ: ప్రముఖ కార్ల తయారీదారు మహీంద్రా తన కంపెనీకి చెందిన పలు కార్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి బీఎస్‌-6 ప్రమాణాలు ఉన్న కార్ల విడుదల నేపథ్యంలో బీఎస్‌-4 ప్రమాణాలు ఉన్న కార్లను చాలా తగ్గింపు ధరలకే అందిస్తున్నది. ఈ క్రమంలో తగ్గింపు ధరలు లభిస్తున్న మహీంద్రా కార్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 

* మహీంద్రా అల్టూరాస్‌ జి4 కారు 2 వేరియెంట్లలో లభిస్తున్నది. రూ.27 లక్షలు, రూ.30 లక్షల ధరలకు ఈ కార్లు లభిస్తుండగా, వీటిపై రూ.2.4 లక్షల వరకు రాయితీని అందిస్తున్నారు. 

* మహీంద్రా కేయూవీ 100 కారుకు చెందిన కె2 వేరియెంట్‌ రూ.17వేల తగ్గింపు ధరకు లభిస్తుండగా, కె4 వేరియెంట్‌ రూ.23వేల తగ్గింపు ధరకు, కె6, కె8 వేరియెంట్లు రూ.38వేలు, రూ.39వేల తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. 

* మహీంద్రా టీయూవీ300కు చెందిన టి4, టి6 వేరియెంట్లపై రూ.56వేల వరకు, టి8, టి10 (ఓ) వేరియెంట్లపై రూ.47వేలు, రూ.38వేల డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. 

* మహీంద్రా బొలెరో పవర్‌ ప్లస్‌పై రూ.6వేల తగ్గింపు ధరను అందిస్తున్నారు. 

* మహీంద్రా థార్‌పై రూ.30వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. 

* మహీంద్రా మరాజో ఎం4 వేరియెంట్‌ రూ.36వేల తగ్గింపు ధరకు, ఎం6, ఎం8 వేరియెంట్లు రూ.77వేలు, రూ.1.39 లక్షల తగ్గింపు ధరకు లభిస్తున్నాయి. 

* మహీంద్రా స్కార్పియోకు చెందిన పలు వేరియెంట్లపై రూ.20వేలు మొదలుకొని రూ.77వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. 


logo