ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 19, 2020 , 00:22:17

మింత్రాతో హంబుల్‌

 మింత్రాతో హంబుల్‌

హైదరాబాద్‌, జనవరి 18: సినీహీరో మహేశ్‌ బాబుకు చెందిన పురుషుల దుస్తుల బ్రాండ్‌ హంబుల్‌..ఆన్‌లైన్‌ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అతిపెద్ద ఫ్యాషన్‌ పోర్టల్‌ మింత్రాతో జతకట్టింది. ఇరు సంస్థల మధ్య కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకనుంచి మింత్రాలో హంబుల్‌ దుస్తులు లభించనున్నాయి. ఈ సందర్భంగా మింత్రా జబాంగ్‌ హెడ్‌ అమర్‌ నాగారామ్‌ మాట్లాడుతూ..ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లను కొనుగోలుదారులకు అందిస్తున్న సంస్థ.. ద్వి, తృతీయ శ్రేణి నగరాల్లో కస్టమర్లకు అందించడానికి హంబుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మింత్రాలో దేశీయ, అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులు లభిస్తున్నాయి. రూ.599 ప్రారంభ ధర మొదలుకొని 200 రకాల దుస్తులను అందిస్తున్నది హంబుల్‌. 


logo