శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 31, 2020 , 01:18:17

ఐఎస్‌బీ డీన్‌గా మదన్‌

ఐఎస్‌బీ డీన్‌గా మదన్‌

హైదరాబాద్‌: ది ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌(ఐఎస్‌బీ) డీన్‌గా ప్రొఫెసర్‌ మదన్‌ పిల్లుట్లా నియమితులయ్యారు. ప్రస్తుతం లండన్‌ బిజినెస్‌ స్కూల్‌లో విధులు నిర్వహిస్తున్న మదన్‌.. ఐఎస్‌బీ 6వ డీన్‌గా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది జూలై 1న పదవీ విరమణ చేయబోతున్న రాజేంద్ర శ్రీవాత్సవ స్థానంలో రానున్నారు. గత రెండు దశాబ్దాలుగా బిజినెస్‌ స్కూల్స్‌లో కీలక పాత్ర పోషించిన ఐఎస్‌బీని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహింపజేసే సత్తా మదన్‌కు ఉన్నదని ఐఎస్‌బీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ చైర్‌పర్సన్‌ హరిష్‌ మన్వాని అన్నారు. తాను డీన్‌గా వ్యవహరించిన నాటి నుంచి ఐఎస్‌బీ అన్ని విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచిందని, ఈ పదవిని మదన్‌కు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత డీన్‌ రాజేంద్ర శ్రీవాత్సవ తెలిపారు. మరోవైపు ఐఎస్‌డీ డీన్‌గా ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉన్నదని పిల్లుట్లా తెలిపారు. 

VIDEOS

logo