చీటింగ్ కేసులో తొలి స్పోర్ట్స్ కారు డిజైనర్ అరెస్ట్

ముంబై : దేశంలోని అతిపెద్ద కార్ డిజైనర్, డీసీ డిజైన్ సంస్థ వ్యవస్థాపకుడు దిలీప్ చాబ్రియాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. చాబ్రియాను మోసం కేసులో అదుపులోకి తీసుకున్నారు. అతడిని కస్టడీలోకి తీసుకుని మరింత సమాచారం రాబట్టాలని ముంబై పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. చాబ్రియాకు చెందిన లగ్జరీ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన తరువాత, అతన్ని రాత్రంతా ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఈ విషయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. దిలీప్ చాబ్రియాపై 420, 465, 467, 468, 471, 120 (బీ), 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆయన నుంచి మరిన్ని విశేషాలను సేకరించిన తర్వాత మీడియాకు అరెస్ట్ సమాచారాన్ని వెల్లడించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు అంటున్నాయి.
డీసీ అవంతి కారు కుంభకోణం కనీసం రూ .40 కోట్లు. ఒకే ఇంజిన్, ఛాసిస్ నంబర్లతో డీసీ అవంతి స్పోర్ట్స్ కారు బహుళ యూనిట్లను చాబ్రియా అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అతను ఒక కారుపై అనేక రుణాలు తీసుకొని, ఆ కారును మూడవ పార్టీకి విక్రయించాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేకాకుండా, చాబ్రియా సొంత సంస్థ రూపొందించిన కార్లను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి రుణాల ద్వారా కొనుగోలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు. ఈ మాదిరిగా 90 కి పైగా కార్లు అమ్ముడు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తొలి స్పోర్ట్స్ కారు డిజైన్ ఈయనదే
భారతదేశపు మొట్టమొదటి స్పోర్ట్స్ కారును చాబ్రియానే డిజైన్ చేశాడు. అతను కార్ల నుంచి లగ్జరీ బస్సుల వరకు ఎన్నో వాహనాలను రూపొందించాడు. అమితాబ్ బచ్చన్ మొదలుకొని షారూఖ్ ఖాన్ వరకు చాలా మంది సినీ ప్రముఖుల కోసం లగ్జరీ కార్లను డిజైన్ చేశాడు. కారుతోపాటు ప్రముఖుల కోసం విలాసవంతమైన వానిటీ వ్యాన్లకు కూడా డిజైన్ చేయడంలో చేయితిరిగిన వ్యక్తిగా ఉన్నాడు. దిలీప్ చాబ్రియా రూపొందించిన కార్లు, వానిటీ వ్యాన్ల తయారీకి కోట్ల వరకు ఖర్చవుతుంది. దిలీప్‌కు అనేక నగరాల్లో ఉన్న ఖాతాదారులలో హాస్యనటులు కపిల్ శర్మ, మాధురి దీక్షిత్, హృతిక్ రోషన్ వంటి తారలు క్లయింట్ జాబితాలో ఉన్నారు. వెరైటీ బైకులను కూడా రూపొందించాడు. బాలీవుడ్ మూవీ టార్జాన్ ది వండర్ కార్ కోసం కూడా అతను ఒక ప్రత్యేక కారును రూపొందించాడు. చాలా పెద్ద నగరాల్లో దిలీప్ చాబ్రియా డిజైన్ స్టూడియోలు ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- టీఎస్ బీపాస్‌కు విశేష ఆదరణ
- సురభి గెలుపే ధ్యేయంగా..
- పట్టభద్రులు ఆలోచించండి..!
- పట్టభద్రులే సరైన నిర్ణేతలు
- లక్షా33 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే: మంత్రి తలసాని
- కీసర బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు
- జోరుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
- ఇక స్వామి దర్శనమే!
- కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం యూటర్న్
- ఓటీటీల్లో అశ్లీలం!