ఆదివారం 07 మార్చి 2021
Business - Feb 14, 2021 , 22:58:53

గ్యాస్ బండ ధ‌ర రూ.50 పెంపు.. ఢిల్లీలో రూ.769

గ్యాస్ బండ ధ‌ర రూ.50 పెంపు.. ఢిల్లీలో రూ.769

న్యూఢిల్లీ: వ‌ంట‌కు ఉప‌యోగించే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండ‌ర్ ధ‌ర రూ.50 పెరుగ‌నున్నాయి. ఈ నెల 15వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి నూత‌న ధ‌ర‌లు అమ‌లులోకి వ‌స్తాయి. స‌వ‌రించిన ధ‌ర‌ల ప్ర‌కారం 14.2 కిలోల గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఢిల్లీలో రూ.769 ప‌లుకుతుంది. పెట్రోల్‌, డీజిల్ వంటి ఇంధ‌న ధ‌ర‌ల మాదిరిగానే అం‌ర్జాతీయ ఇంధ‌న ధ‌ర‌ల‌కు అనుగుణంగా గ్యాస్  కేంద్ర చ‌మురు సంస్థ‌లు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. 

స‌బ్సిడీయేత‌ర ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్ల ధ‌ర‌లను కేంద్ర చ‌మురుసంస్థ‌లు నెల‌కోసారి స‌మీక్షిస్తుంటాయి. ప్ర‌తి నెలా ఒక‌టో తేదీన స‌బ్సిడీయేర‌త సిలిండ‌ర్ ధ‌ర మారుతుంటుంది. వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు.. రాష్ట్రాల వారీగా ప‌న్నుల‌కు అనుగుణంగా మారుతాయి. సిలిండర్ల‌పై ఇచ్చే స‌బ్సిడీ సంబంధిత ల‌బ్ధిదారుల బ్యాంకుల ఖాతాల్లో కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ చేస్తుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo