ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Sep 03, 2020 , 01:55:32

వంటగ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేత?

వంటగ్యాస్‌పై సబ్సిడీ ఎత్తివేత?

న్యూఢిల్లీ: వంటగ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం షాకివ్వబోతున్నదా! ప్రస్తు పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. వంటగ్యాస్‌ సిలిండర్‌ను కొనుగోలు చేసిన వారికి దీర్ఘకాలికంగా నగదు బదిలీ ప్రక్రియకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా తగ్గడంతోపాటు తరుచుగా ధరల పెంచడాన్ని స్వస్తి పలికేయోచనలో ఉన్నది. దీంతో సామాన్య మానవుడు మార్కెట్‌ ధరకు సిలిండర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.594 స్థాయిలో ఉన్నది. మరోవైపు సబ్సిడీ, సబ్సిడీయేతర సిలిండర్‌ ధరల మధ్య అంతరం రోజు రోజుకు తగ్గుతుండటం కూడా ఇందుకు కారణం. ఒకవేళ సబ్సిడీ ఎత్తివేసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి రూ.20 వేల కోట్ల మేర ఖర్చు తగ్గనున్నది.

VIDEOS

logo