సోమవారం 01 జూన్ 2020
Business - Apr 14, 2020 , 00:22:23

వెంటాడిన లాక్‌డౌన్‌ భయాలు

వెంటాడిన లాక్‌డౌన్‌ భయాలు

  • సెన్సెక్స్‌ 470, నిఫ్టీ 118 పాయింట్ల పతనం

ముంబై, ఏప్రిల్‌ 13: తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగిన స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనం చెందాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఈ నెల చివరి వరకు పొడిగించే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన సంకేతాలు మార్కెట్లను నష్టాల వైపు నడిపించాయి. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. ఒక దశలో 500 పాయింట్లకు పైగా నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 469.60 పాయింట్లు పతనం చెంది 31 వేల పాయింట్ల దిగువకు 30,690.02కి పడిపోగా, జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 118.05 పాయింట్లు తగ్గి 8,993.85 వద్దకు జారుకున్నాయి.  21 రోజులు ప్రకటించిన లాక్‌డౌన్‌ మంగళవారం ముగియనుండటంతో ప్రధాని మరోమారు దీనిని పొడగింపుపై ప్రకటన చేసే అవకాశం ఉండటం మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయి.  మార్కెట్లో బజాజ్‌ ఫైనాన్స్‌ 10 శాతానికి పైగా పతనం చెంది టాప్‌ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, టైటాన్‌, హీరో మోటోకార్ప్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రాలు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కూడా పతనం చెందాయి. మరోవైపు ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.


logo