శనివారం 30 మే 2020
Business - Apr 22, 2020 , 10:53:25

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌- తీవ్ర న‌ష్టాల్లో వ‌ర్జిన్ ఎయిర్ లైన్స్

లాక్‌డౌన్ ఎఫెక్ట్‌- తీవ్ర న‌ష్టాల్లో వ‌ర్జిన్ ఎయిర్ లైన్స్

క‌రోనా ఎఫెక్ట్ తో అన్ని రంగాలు కుదేల‌వుతున్నాయి. ముఖ్యంగా విమాన‌యాన రంగంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంది.   ఆస్ట్రేలియాలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరు తెచ్చుకున్న వర్జిన్ ఆస్ట్రేలియా పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారిపోయింది. లాక్‌డౌన్ కార‌ణంగా నెల రోజులుగా స‌ర్వీసులు లేక‌పోవ‌డంతో ఆ సంస్థ తీవ్ర‌న‌ష్టాల్లో కూరుకుపోయింది. వర్జిన్ ఎయిర్ లైన్స్ లో 10వేలమంది సిబ్బంది ప్ర‌త్య‌క్షంగా ప‌నిచేస్తుండ‌గా... పరోక్షంగా ఈ ఎయిర్ లైన్స్ పై ఆధారపడి మరో 6వేలమంది పనిచేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం నుంచి సుమారు రూ.6,800 కోట్లు రుణంగా పొందాల్సి ఉన్నా, కొన్ని కారణాల వలన పొందలేకపోయింది. వాస్త‌వానికి ఆస్ట్రేలియా లో కరోనా వైరస్ కాస్త తక్కువుగా ఉన్నప్పటికీ ఇంకా అక్కడ లాక్ డౌన్ కొనసాగుతూనే ఉన్నది.  లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. 


logo