శుక్రవారం 05 జూన్ 2020
Business - May 05, 2020 , 22:14:52

ఈ-కామ‌ర్స్‌ల్లో ట్రిమ్మ‌ర్ల కోసం స‌ర్చ్ చేస్తున్నారు...

ఈ-కామ‌ర్స్‌ల్లో ట్రిమ్మ‌ర్ల కోసం స‌ర్చ్ చేస్తున్నారు...

న్యూఢిల్లీ:  కోవిడ్ 19 కేసులు త‌క్క‌వ ఉన్న ప్రాంతాలైన ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో నిత్యావ‌స‌ర స‌రుకుల స‌ర‌ఫ‌రా కోసం ఈ కామ‌ర్స్ సంస్థ‌ల‌కు అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే అత్య‌ధికంగా వినియోగ‌దారులు స్మార్ట్‌ఫోన్లు, గ్యాస్‌స్ట‌వ్‌లు, ట్రిమ్మ‌ర్ల కోసం స‌ర్చ్ చేస్తున్నార‌ని వాల్‌మార్ట్ సంస్థ ప్ర‌క‌టించింది. ఏప్రిల్ ప్రారంభం నుంచి ట్రిమ్మ‌ర్ల కోసం స‌ర్చింగ్ 4.5 శాతం పెరిగి, అత్య‌దికంగా స‌ర్చింగ్ చేసే 10 ఉత్ప‌త్తుల్లో ట్రిమ‌ర్లు కూడా నిలిచాయి. గ్యాస్ స్ట‌వ్‌ల కోసం గ‌తంలో కంటే రెట్టింపు స‌ర్చింగ్‌జ‌రిగింది. దేశ‌వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డంలో ఎయిర్‌కండిష‌న్ల‌ను కూడా స‌ర్చ్ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో నిత్యావ‌స‌రాల స‌ర‌ఫ‌రాకు అనుమ‌తి ఇస్తే వినియోగ‌దాలు మాత్రం ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, ముబైల్స్‌, ఎయిర్‌కండిష‌న్లు, కూల‌ర్లు, టీష‌ర్ట్స్ కోసం స‌ర్చ్ చేస్తున్నార‌ని ప్లిప్‌కార్ట్ సీనియ‌ర్ వైస్ ప్ర‌సిడెంట్ అనిల్ గోటేటి తెలిపారు.

ప్లిప్‌కార్ట్‌లో మా వినియోగ‌దారుల‌కు సుర‌క్షిత‌మైన ప‌ద్ద‌తిలో ప‌రిశుభ్ర‌మైన చైన్ ద్వారా సేవ‌లు కొన‌సాగిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. స్థానిక రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌కు అనుగూణంగా న‌డుచుకుంటున్నామ‌ని తెలిపారు. మొద‌టి, రెండ‌వ లాక్‌డౌన్ ముగిసి మూడో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఈ కామ‌ర్స్ సంస్థ‌ల ద్వారా కిరాణా, ఇత‌ర అత్య‌వ‌స‌ర సామాన్లు మాత్ర‌మే అందిస్తున్నారు. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లి కొనుగోలు చేయ‌కూడ‌ద‌న్న ధోర‌ణి ప్ర‌జ‌ల్లో కొన‌సాగ‌వ‌చ్చ‌ని ప‌రిశీలకులు భావిస్తున్నారు. మాల్స్‌, పెద్ద మార్కెట్లు మూసి ఉండ‌టం వ‌ల్ల ఈ కామ‌ర్స్ మాత్ర‌మే ఎంచుకుని ఇంటికి సామాను తెప్పించుకునే అవ‌కాశం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.  


logo