సోమవారం 01 జూన్ 2020
Business - Apr 13, 2020 , 19:34:14

లాక్‌డౌన్‌లోనూ ప‌సిడికి రికార్డు ధ‌ర‌

లాక్‌డౌన్‌లోనూ ప‌సిడికి రికార్డు ధ‌ర‌

లాక్‌డౌన్‌లోనూ బంగారానికి రికార్డు ధర ప‌లికింది. కరోనా వైరస్‌ లాక్ డౌన్‌ కారణంగా దుకాణాల్లో బంగారం కొనుగోళ్ళు జరగనప్పటికీ... ప‌సిడి ధ‌ర అమాంతం పెరిగిపోయింది. నిన్న క్లోజింగ్ స‌మ‌యంలో 45,294 ఉన్న ప‌దిగ్రాముల బంగారం ధ‌ర ఇవ్వాళ 45, 950కి చేరింది. అయితే లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో బంగారానికి దేశీయంగా అంత డిమాండ్ లేన‌ప్ప‌టికీ అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డంతో ధ‌ర పెరిగిన‌ట్లు విశ్లేష‌కులు చెపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌19 మహమ్మారీ విజృంభిస్తుండడంతో ఆయాదేశాలు ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యలతో బంగారం ధర పరుగులు పెడుతోంది. 

logo