శుక్రవారం 14 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 02:11:23

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణాలు చౌక

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రుణాలు చౌక

ముంబై, జూలై 7: దేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ రంగ బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన ఖాతాదారులకు శుభవార్తను అందించింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చేలా ఎంసీఎల్‌ఆర్‌తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 20 బేసిస్‌ పాయిం ట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంక్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.10 శాతం నుంచి 7.65 శాతం లోపు దిగిరానున్నాయి. ఒక్కరోజు రుణాలపై రేటు 7.10 శాతంగాను, ఒక నెల కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ రేటు 7.15 శాతంగాను, ఏడాది రుణాలపై 7.45 శాతం, మూడేండ్ల రుణాలపై 7.65 శాతానికి తగ్గనున్నాయి. 


logo