శుక్రవారం 05 జూన్ 2020
Business - May 11, 2020 , 09:05:42

ఎంఎస్‌ఎంఈలకు రుణ హామీ?

ఎంఎస్‌ఎంఈలకు రుణ హామీ?

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:కరోనా దెబ్బకు చితికిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర ప్రభుత్వం రుణ హామీ పథకాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉద్యోగులకు కనీస వేతనాలను సైతం ఇవ్వలేని దుస్థితికి ఎంఎస్‌ఎంఈలు చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో అదనంగా 10-15 శాతం నిర్వహణ మూలధనాన్ని అందించాలని కేంద్రం చూస్తున్నట్లు తెలుస్తున్నది. 

సంక్షోభ నివారణ కోసం

సంక్షోభంలో కూరుకుపోయిన ఎంఎస్‌ఎంఈలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే యూసుఫ్‌గూడలోని ఎంఎస్‌ఎంఈ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ (నిమ్స్‌మే) చర్యలు తీసుకుంటున్నది. సీనియర్‌ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ నిపుణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. వారి అభిప్రాయాలను, ఆలోచనలను తెలుసుకుంటున్నారు. వీరి సూచనలకు అనుగుణంగా నివేదికలు తయారు చేసి వీటిని కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. మరోవైపు ఎంఎస్‌ఎంఈ రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం http://ideas.msme.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభించింది.


logo