2nd wave Loans demand | కోవిడ్-19 ఉధ్రుతి ప్రభావంతో రుణాలకు డిమాండ్ పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే జూన్లో 11.9 శాతం పర్సనల్ లోన్స్ పెరిగాయి. అవి గతేడాది జూన్లో 10.4 శాతం మాత్రమే. కోవిడ్, ఇతర కారణాల వల్ల జూన్లో బంగారం ఆభరణాలపై తీసుకోవడానికి మొగ్గు చూపారని రిజర్వు బ్యాంక్ సెక్టోరల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్-జూన్ 2021 రిపోర్ట్ వెల్లడించింది. అదే సమయంలో వెహికల్స్ కొనుగోళ్లకు ఎక్కువ రుణాలు తీసుకున్నారు.
సుమారు 90 శాతం మంది తీసుకున్న రుణాలన్నీ నాన్-ఫుడ్ లోన్లే కావడం గమనార్హం. 2020తో ఇవే రుణాలు ఆరు శాతం మాత్రమే. ఈ ఏడాది 5.9 శాతం ఎక్కువయ్యాయని దేశంలోని 33 వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన రుణాల డేటా చెబుతున్నది. ఈ పీరియడ్లోని మొత్తం రుణాల్లో 11.4 శాతానికి పైగా వ్యవసాయం, దాని అనుబంధ అవసరాలకు తీసుకున్నవే. గతేడాదితో పోలిస్తే 2.4 శాతం ఎక్కువయ్యాయి.
గమ్మత్తేమిటంటే పారిశ్రామిక అవసరాల కోసం రుణాలు మాత్రం స్వల్పంగా 0.3 శాతం తగ్గుముఖం పట్టడం ఆసక్తికర పరిణామం. గతేడాది 2.2 శాతం ఎక్కువయ్యాయి. గత జూన్లో మధ్య తరహా పరిశ్రమల రుణాలు 54.6, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రుణాలు 6.4 శాతం పెరిగాయి. భారీ పరిశ్రమలు తీసుకున్న రుణాలు 3.4 శాతమే.
ఇక సర్వీస్ సెక్టార్ లోన్ గ్రోత్ 2.9 శాతానికే పరిమితమైంది. గతేడాది జూన్లో సర్వీస్ సెక్టార్ 10.7 శాతం రుణాలు తీసుకున్నది. కానీ కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఎన్బీఎఫ్సీ, టూరిజం, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కూడా రుణాలకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!