Home Loans | ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో దేశంలోకెల్లా అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ.. తన కస్టమర్లకు న్యూ హోంలోన్లపై బోనంజా ఆఫర్లు ప్రకటించింది. ఇంతకుమందు తీసుకున్న ఇండ్ల రుణాల బకాయిల బదిలీకి కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి రుణం మొత్తంతో సంబంధం లేకుండా 6.7 శాతం వడ్డీరేటుపైనే ఎస్బీఐ ఇండ్ల రుణం మంజూరు చేస్తున్నది. ఇండ్ల రుణాలపై అందరికీ ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేసింది.
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకర్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఫెస్టివ్ హోంలోన్లపై ఆఫర్లు అందిస్తోంది. 6.7 శాతం వడ్డీరేట్లకే ఈ రుణం మంజూరు చేస్తున్నది. ఒకసారి బ్యాంకులు, గృహ ఫైనాన్స్ సంస్థలు రూ. 75 లక్షల వరకూ తక్కువ వడ్డీరేట్లపై హోంలోన్లు ఇస్తున్నాయి. అవేంటో చూద్దాం..
బ్యాంక్ పేరు —————- వడ్డీరేటు (%)
కొటక్ మహీంద్రా ——- —- 6.5
పంజాబ్ సింధ్ ——- —– 6.65
ఎస్బీఐ —————– —— 6.7
టాటా క్యాపిటల్ ———— 6.7
బ్యాంక్ ఆఫ్ బరోడా ——- 6.75%
బజాజ్ ఫిన్ సర్వ్ ——– 6.75%
పంజాబ్ నేషనల్బ్యాంకు- 6.8%