బుధవారం 03 జూన్ 2020
Business - Apr 24, 2020 , 18:08:34

వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్

వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్

హౌసింగ్ లోన్‌ తీసుకోవాలనుకునేవారికి ఎల్‌ఐసీ శుభవార్త తెలిపింది. వడ్డీ రేట్లను భారీగా త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలి అనుబంధ సంస్థ. ఇళ్ల రుణాలను ఇచ్చే అతిపెద్ద సంస్థ కూడా ఎల్ఐసీహెచ్ఎఫ్ఎల్ కావ‌డం విశేషం. సిబిల్ స్కోర్ 800 పైన ఉన్న కొత్త కస్టమర్లకు 7.50 శాతానికే హోమ్ లోన్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించింది. గతంలో  8.10 శాతం ఉన్న వ‌డ్డీరేటును 7.50శాతానికి త‌గ్గించింది. అంటే ఏకంగా హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు 60 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అంతేకాదు ఎల్‌ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ దగ్గర తీసుకునే రుణానికి సమానంగా సింగిల్ ప్రీమియం టర్మ్ అష్యూరెన్స్ పాలసీ తీసుకునే కస్టమర్లకు మరో 10 బేసిస్ పాయింట్స్ తక్కువకే హోమ్ లోన్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి కూడా ఈ తగ్గింపు వర్తిస్తుందని వివ‌రించింది.logo